Products

సూర్యపుత్ర దేశీయ గోముత్రం / Suryaputhra Desi Gowmutra

సూర్యపుత్ర దేశీయ గోముత్రం / Suryaputhra Desi Gowmutra

సూర్య పుత్రను వల్ల కలిగే ప్రయోజనాలు :

1. (Powerful Spreader) ఇది " జారుడు గుణం కలిగి" మొక్కలపై పిచికారి చేసినప్పుడు వివిధ రకాల పదార్థాలను త్వరగా వ్యాపింప చేయడంలో ఉపయోగపడుతుంది.

2. దీనిని మొక్కలపై పిచికారి చేసే  ప్రతి కీటక నాసిని, శిలీంద్ర నాసిని లో కలపడం వల్ల  సమర్థవంతంగా పనిచేస్తాయి.

3. దీనిని జీవామృతము / వానపాముల ద్రవము (Vermiwash)/ గుడ్డు ద్రావణం (Egg Amino acids)/ మీనామృతము (Fish amino acids) లో కలిపి ఉపయోగించవచ్చును.

4. దేశీ గోమూత్రంలోని  ఘాటైన వాసన వలన  కొన్ని రకాల తామర పురుగులు, నల్లులు, రసం పీల్చే పురుగులు  దూరంగా వెళ్తాయి.

5. పండ్లు, కాయలు నునుపుగా రావడానికి (Shining)/ మంగు రాకుండా /నల్లి రాకుండా / మంచి వాసన ( flavor)/ మంచి రుచి (Taste) / మంచి రంగు (Fruit colour) రావడానికి ఉపయుక్తమైనది.

6. మొక్కలు ఒత్తిడి నుంచి అధిగమించడానికి ఉపయోగపడుతుంది. (Stress reliefer).

Exp. Date : తయారీ చేసినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది.

Storage: చీకటి ప్రదేశంలో, గాలి దూరకుండా భద్రపరుచుకోవాలి.

Store in Cool, dark, Air tight containers.

Conclusion:

Suryaputra is a “Desi Gomutra” Eco friendly, Natural Product, Alternative to Chemical Spreader.

Dr.RSS Citrus Material

Dr.RSS Citrus Material

 

About The Book (పుస్తకం గురించి)

ఈ పుస్తకంలో రచయిత తన స్వీయ అనుభవంలో మరియు క్షేత్ర పరిశోధనలో జరిగిన అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని నిమ్మ జాతి మొక్కల సాగు గురించి  ప్రతి అంశాన్ని PROTOCOLS రూపంలో తీసుకురావడం జరిగింది. ఇందులో ప్రధానంగా మొక్క ఎంపిక విధానం, మొక్క నాటే విధానం, పెరుగుదల యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, అతి ముఖ్యంగా అనేక రకాల వ్యాధుల గురించి PROTOCOLS రూపంలో పూర్తిగా వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా భవిష్యత్తు తరాలను, యువ రైతులను  దృష్టిలో ఉంచుకొని నిమ్మ జాతి మొక్కల గురించి శాస్త్రీయ విజ్ఞానాన్ని ఈ పుస్తకం ద్వారా అందించడమైనది. మొక్క పెరుగుదలకు అతి ముఖ్యమైన మొక్క పెరుగుదల నియంత్రకాలు (PGR), (PGP), వివిధ రకాల హార్మోన్లు/ ఎంజైమ్ లు అంతేకాకుండా  ORGANIC FARMING సంబంధించి అనేక ఫార్ములాలు గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.

ఇక చివరగా రచయిత తన ఆచరణాత్మక వ్యవసాయ పరిశోధన ఫలితాలను సామాన్య, చిన్న, సన్న కారు రైతులకు చేరవేయడానికి ప్రతి అంశాన్ని పూర్తిగా విశ్లేషించి PROTOCOLS రూపంలో ఈ పుస్తకం ద్వారా అందించడం జరిగింది.